ఆది శంకరాచార్యులు

public profile

ఆది శంకరాచార్యులు's Geni Profile

Share your family tree and photos with the people you know and love

  • Build your family tree online
  • Share photos and videos
  • Smart Matching™ technology
  • Free!

Related Projects

Adi Shankara

Telugu: శంకరాచార్యులు
Birthdate:
Birthplace: Kalady, Ernakulam, KL, India
Death: 820 (31-32)
Kanchipuram, Kanchipuram, TN, India
Immediate Family:

Son of Shiva Guru and Aryamamba

Managed by: Private User
Last Updated:
view all

Immediate Family

About ఆది శంకరాచార్యులు

కేరళ కాలడిలో ఆర్యాంబ - శివ గురువు లకు జన్మించిన పుత్రుడు శంకరులు. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్ శివుని అవతారమని నమ్మకం ఉంది.

3 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు శంకరుల తండ్రి కాలం చేశాడు.  శంకరులు ఏక సంతాగ్రహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనక ధారా స్తోత్రాన్ని చెప్పారు. కనక ధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింప చేసింది . పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా మొసలి పట్టుకుందని చెప్పి, సన్యాసం తీసుకుంటే గానీ వదిలేలా లేదని తల్లిని ఒప్పించాడు. తల్లి అనుమతితో కాలడి నుంచి కాలినడక ప్రారంభించాడు. ఆ నడక దేశ గతిని మార్చింది. ఆధ్యాత్మిక చరిత్రను తిరగరాసింది. ఆర్ష సంస్కృతి వైభవాన్ని మళ్లీ నిలబెట్టింది.   

శంకరులు నర్మదా నదీ తీరంలో శ్రీ గోవింద భగవత్పాదులను దర్శించుకొని సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాడు. గోవింద భగవత్పాదులు వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థాన త్రయం అంటారు. సమస్త అవైదిక మతాలను ఖండించి వేద సమ్మతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వారణాసిలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమై శంకరుల సిద్ధాంతానికి తన ఆమోదం తెలపడమే కాకుండా, అద్వైతం సర్వజనామోదం అవుతుందని అనుగ్రహించాడు. ఆ క్షణం నుంచి మొదలైంది శంకర విజయ యాత్ర.

వైదిక ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన శంకరుల వెంట ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు హస్తమలక, సురేశ్వర, పద్మపాద, తోటకాచార్యులు రూపంలో శిష్యులుగా అవతరించాయి. వారణాసిలో పద్మపాదుడు శంకరుల శిష్యుడిగా చేరాడు. బ్రహ్మావతార స్వరూపంగా భావించే మండన మిశ్రుడు శంకరులతో జరిగిన వాదనలో ఓడి సన్యాసం తీసుకుని, సురేశ్వరాచార్యులుగా శిష్యుడయ్యాడు. హస్తామలకాచార్యుడు, తోటకాచార్యులు ఆది శంకరుల శిష్యులయ్యారు.

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధం, జైన మతాల ప్రాబల్యం కారణంగా సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడి, శంకరుల కాలం నాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారికి తగవులు ఉండగా వేదాలను నిరసించేవారు. శంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు.

శారదా పీఠంలో (ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీరు) సర్వజ్ఞ పీఠం లేదా సర్వజ్ఞుల సింహాసనం అని పిలువబడే నాలుగు సింహాసనాలు నాలుగు దిక్కుల నుంచి ఆలయ ప్రవేశాన్ని సూచిస్తాయి. ఆ దిశ నుండి వచ్చిన మహా జ్ఞాని మాత్రమే దానిని అధిరోహించ గలడు. అంత వరకు దక్షిణం నుండి ఎవరూ విజయం సాధించలేదు. ఆది శంకరుడు ఈ సవాలును స్వీకరించి అక్కడ పండితులను ఓడించి ఆ సింహాసనాన్ని అధిష్టించాడు. (14వ శతాబ్దంలో రచించబడిన మాధవీయ శంకర విజయం ఆధారంగా).

శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీప స్తంభాలలా పనిచేశాయి.

ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. గణేశ పంచ రత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనక ధారా స్తోత్రం,శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థన స్తోత్రాలు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. సంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. స్మార్తులు, సంతులు అతను నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్మత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవే.

పరమాత్మ వివిధ రూపాలు దేవతలని, గణేశుడు, సూర్యుడు, విష్ణువు, శివుడు మరియు దేవి అనే ఐదు దేవతలను ఏకకాలంలో ఆరాధించడం ద్వారా పంచాయతన ఆరాధన తో వివిధ శాఖలను (వైష్ణవం, శైవమతం మరియు శాక్తత్వం) సమన్వయం చేసిన వ్యక్తిగా శంకరాచార్యుడు పేర్కొనబడ్డాడు. శ్రీ శంకరులు తిరుపతిని సందర్శించి "విష్ణు పాదాది కేశాంత స్తోత్రం" అనే శ్లోకాన్ని పఠించారు, ఇది భగవంతుని పాదాల నుండి శిరస్సు వరకు వివరిస్తుంది.
---

view all

ఆది శంకరాచార్యులు's Timeline

788
788
Kalady, Ernakulam, KL, India
820
820
Age 32
Kanchipuram, Kanchipuram, TN, India